వాట్సాప్  యూజర్లకు శుభావార్త.. ఇక నుంచి  వాట్సాప్ లో కూడా  కాల్ వెయిటింగ్.. కానీ!

Suma Kallamadi

ప్రస్తుత  రోజులలో  ప్రతి ఒక్కరికి ఫోన్లలో పనులు మొత్తం కొనసాగుతున్నాయి. ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్  ఐనా  వాట్సాప్ అందించే ఫీచర్ల జాబితాలో మరో ఫీచర్ వచ్చింది. ఆ   మరో ఫీచర్ ఏమిటి అంటే కాల్ వెయిటింగ్. వాస్తవానికి దీని గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ మాత్రమే కాకుండా సాధారణ ఫీచర్ ఫోన్ ఉపయోగించే వారికి కూడా ఈ ఫీచర్ బాగా తెలుసు. ఇక వివరాలోకి వెళ్తే మనం వేరే వారితో కాల్ మాట్లాడేటప్పుడు మనకు ఎవరైనా కాల్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ఒక వేళా విషయం చాల ఇంపార్టెంట్ ఐతే మనం ప్రస్తుతం మాట్లాడే కాల్ హోల్డ్ లో పెట్టి వారితో మాట్లాడవచ్చు. లేక మనం ప్రస్తుతం మాట్లాడే కాల్ పూర్తయ్యాక వారికి తిరిగి మళ్ళి కాల్ చేయచ్చు.

 

ఇప్పుడు ఇలాంటి  ఫీచర్ ను వాట్సాప్ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అంటే మనం వాట్సాప్ లో ఎవరితో అయినా కాల్ మాట్లాడుతుంటే.. అదే సమయానికి మనకు వేరే వారు కాల్ చేస్తే కాల్ వెయిటింగ్ వస్తుంది. ఈ ఫీచర్ కేవలం ఆడియో కాల్స్ కు మాత్రమే కాకుండా వీడియో కాల్స్ కు కూడా ఉంది అని సంస్థ తెలియచేస్తుంది. అంటే మీరు వేరే వారితో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మీకు మరో వీడియో కాల్ వస్తే.. ఆ కాల్ కూడా వెయిటింగ్ అని వస్తుంది. వాస్తవానికి  ఈ ఫీచర్ ఐవోఎస్ కు ఇప్పటికే అందుబాటులోకి ఉండగా... ఆండ్రాయిడ్ కు మాత్రం తాజా అప్ డేట్ ద్వారా తీసుకొని రావడం జరిగింది సంస్థ నుంచి.

 

 

కానీ ఇందులో  ఒక ట్విస్ట్ అది ఏమిటి అంటే  కాల్ వెయిటింగ్ ఫీచర్ ఉంది కానీ హోల్డ్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొని రాలేదు. అంటే మీరు వెయిటింగ్ లో ఉన్న కాల్ మాట్లాడాలి అనుకుంటే.. ప్రస్తుతం మాట్లాడే కాల్ ను కట్ చేయాలి, లేకపోతే ఆ కాల్ ను మాట్లాడే అవకాశం లేదన్న మాట. అయితే కాల్ వెయిటింగ్ ఫీచర్ ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది కాబట్టి త్వరలో హోల్డ్ ఆప్షన్ ను కూడా వాట్సాప్ అందించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వాట్సాప్ ఇప్పటికే ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. 

 

 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: